దెందులూరు: ఆదివారం దెందులూరు నియోజకవర్గం పోతునూరు గ్రామంలో గౌరీ శంకర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమం లో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం ఇంచార్జీ డా. ఘంటసాల వెంకటలక్ష్మి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చిన్న హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ గౌరీ పరమేశ్వర ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని వెంకటలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో పోతునూరు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు చదరం విద్యాసాయి, టిడిపి గ్రామ అధ్యక్షులు, పోతునూరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ బొడ్డేటి మోహన్, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment