ఘనంగా ఆరణి మదన్ జన్మదిన వేడుకలు

*నగరంలో పలుచోట్ల సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన జనశ్రేణులు..

తిరుపతి నియోజకవర్గం: తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు తనయుడు జనసేన పార్టీ యువనేత, కార్యకర్తలకు కష్టం వస్తే అండగా నిలబడే వ్యక్తి ఆరణి మదన్ మోహన్ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆదివారం తిరుపతి ఎన్జీవో కాలనీ పార్టీ ఆఫీస్ నందు జనశ్రేణులు ఏర్పాటుచేసిన బర్తడే కేక్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆరణి జగన్ లు కట్ చేసి ఘనంగా బర్తడే వేడుదలను జరుపుకున్నారు. అనంతరం ఎజేఎంసి ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో సికాం కాలేజీ స‌మీపంలో, ఎంఆర్ ప‌ల్లి అన్నాక్యాంటిన్ వద్ద రెండు మిన‌ర‌ల్ వాట‌ర్ ఫ్లాంట్లును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆరణి జగన్ లు పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. నగరంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు పార్టీ శ్రేణులు నిర్వహించగా.. అందులో భాగంగా రూయా హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆరణి జగన్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా.. ఆరణి జగన్ మాట్లాడుతూ.. మా అన్న మదన్ మోహన్ జన్మదిన వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతునిని ప్రార్థిస్తున్నామన్నారు. నగర అధ్యక్షుడు రాజా రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ యువ నేత, కార్యకర్తలకు అండగా నిలబడే మంచి వ్యక్తి మా ఆరణి మదన్ మోహన్ అని, వారిపై ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీలో కీలక నేతగా మదన్మోహన్ ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో.. కూటమి నేతలు నగర అధ్యక్షుడు రాజా రెడ్డి, సూరా సుధాక‌ర్ రెడ్డి, కార్పోరేట‌ర్లు సికే రేవ‌తి, వ‌రికుంట్ల నారాయ‌ణ‌, పొన్నాల చంద్ర‌, ఎస్ కే బాబు, సుమన్ బాబు, మ‌హేష్ యాద‌వ్, నీలాద్రీ, వివేక్, ఉద‌య్, జాన‌కి రామ్ రెడ్డి, దుర్గా మ‌ల్లేష్, ముర‌ళీ, ఆర్కాట్ కృష్ణ‌ప్ర‌సాద్, ఆళ్వార్ ముర‌ళీ, ఆముదాల వెంక‌టేష్, సుబ్బూ యాద‌వ్, వినోద్, సుభాషిణి, కొండా రాజ్ మోహ‌న్, బాబ్జీ, రాజేష్ ఆచ్చారి, సుధా, బాలిశెట్టి కిషోర్, దూది ర‌మేష్, బండ్ల ల‌క్ష్మీప‌తి, మ‌ధులత‌, శిరీష‌, కూర‌పాటి సురేష్, మునిరామ‌య్య, సానె శ్రీనివాస్, జీవ‌న్, మంజు, రమేష్ నాయుడు, సుధాకర్, శ్రావణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-08-17-at-8.31.28-PM-1-1024x750 ఘనంగా ఆరణి మదన్ జన్మదిన వేడుకలు
WhatsApp-Image-2025-08-17-at-8.31.27-PM-1024x683 ఘనంగా ఆరణి మదన్ జన్మదిన వేడుకలు

Share this content:

Post Comment