తాడేపల్లిగూడెం: పెంటపాడు మండలం, మౌంజిపాడు వెస్ట్ విప్పర్రు గ్రామ పరిధిలో రెండు రోజులుగా కుడుస్తున్న భారీ వర్షాలకు ముంపునకు గురైన వరి చేలను, పంట బోదెలను మరియు ఇళ్ళను పరిశీలించిన గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. ఈ సందర్బంగా ఆయన్ మాట్లాడుతూ.. మండల తహాసిల్దార్ పెంటపాడు వారిని ముంపునకు గురైన ప్రజలకు ప్రభుత్వం తరఫున వారికి బియ్యాన్ని, నిత్యవసర వస్తువులను అందించవలసిందిగా అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు డ్రైయిన్స్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ అధికారులను లోతట్టు ప్రాంతాల నుండి సక్రమంగా నీరు పారుదలకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందించడానికి తగిన చర్యలను తీసుకొనవలసినదిగా ఆదేశించారు.
Share this content:
Post Comment