పి. గన్నవరం నియోజకవర్గం: అంబాజీపేట మండలంలోని అంబాజీపేట మార్కెట్ యార్డులో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్‌గా, చిట్టూరి శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా కొర్లపాటి వెంకటేశ్వరరావు ప్రమాణం చేశారు. వీరితో పాటు డైరెక్టర్లు కూడా పదవీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం ముందు చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ తన సొంత గ్రామం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి అంబాజీపేట చేరుకోగా, వైస్ చైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే తో కలిసి అంబాజీపేట చేరుకొని, అక్కడి నుంచి అంబాజీపేట సెంటర్ వరకు ర్యాలీగా సభా ప్రాంగణానికి వెళ్లారు. ర్యాలీలతో, పూల వర్షాలతో, జైకారాలతో అంబాజీపేట వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొత్తగా ఏర్పడిన పాలకవర్గం రైతుల మేలు దిశగా కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి సామాన్య కార్యకర్తలకు కూడా పదవులు లభించేలా అవకాశం కల్పించామన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు తప్పక వస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టిడిపి పోలీస్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రమణ్యం, రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి, అలాగే పేరభత్తులు రాజశేఖరంకి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Share this content:
Post Comment