కేజీ నుంచి పీజీ వరకు ఆన్ లైన్ తరగతులే: సబితా ఇంద్రారెడ్డి

జులై 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకుంటున్న నేపథ్యంలో బోధన తీరుతెన్నులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో, తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఆన్ లైన్ లోనే తరగతులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జులై 1 నుంచి ఆన్ లైన్ తరగతులు షురూ అవుతాయని, టీ శాట్ ద్వారా ఆన్ లైన్ లో విద్యాబోధన సాగుతుందని వివరించారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించారు. ఫీజుల విషయంలో జీవో నెం.46ని అనుసరించాలని విద్యాసంస్థలకు స్పష్టం చేశారు. నెలవారీగా ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలని నిర్దేశించారు.