భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌‌ క్లినికల్ ట్రయల్స్.. సమర్థంగా వైరస్ కు చెక్ పెడుతున్న చుక్కల మందు!

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ (బీబీవీ 154) మంచి ఫలితాలు కనబరుస్తున్నట్టు క్లినికల్ పరీక్షల్లో వెల్లడైంది. ఈ చుక్కల మందు పూర్తిగా ప్రదర్శించడంతోపాటు మానవ శరీరంలోకి కరోనా వైరస్ చేరకుండా సమర్థంగా నివారించగలదని తొలి దశ క్లినికల్ పరీక్షల్లో తేలినట్టు సమాచారం. ఈ పరీక్షల ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. త్వరలోనే రెండు, మూడు దశల ప్రయోగాలు కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

కరోనా వైరస్ ముక్కు నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి గొంతు, ఆపై ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది. కాబట్టి ముక్కు ద్వారా వేసే ఈ చుక్కల టీకా అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నాసల్ టీకాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.