నింగిలోకి సామాన్యులు.. స్పేస్‌ఎక్స్‌ తొలి పౌర అంతరిక్షయానం

ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అరుదైన రికార్డ్ సాధించింది. నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్ ను తొలిసారి స్పేస్ లోకి పంపించింది. నాసా లాంచింగ్ స్టేషన్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం చేపట్టిన స్పేస్ ఎక్స్… నలుగుర్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

తమ రాకెట్ నిర్దేశిత మార్గంలోనే ప్రయాణించిందని.. నలుగురు నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్‌ ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ట్వీట్ చేసింది స్పేస్ ఎక్స్. వీరంతా మూడు రోజుల పాటు అంతరిక్షంలోనే గడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ కు ఇన్‌‌ స్పిరేషన్ 4 అని పేరు పెట్టింది.
ఓ ఆసుపత్రికి విరాళం ఇచ్చేందుకు ఈ యాత్ర చేపట్టింది స్పేస్ ఎక్స్. ఈ ప్రాజెక్టులో వచ్చే ప్రతీ డాలర్ ను సెయింట్ జ్యూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఆసుపత్రికి అందించాలని నిర్ణయించింది. అంతరిక్ష పరిశోధనలతో ఎలాంటి సంబంధం లేని సామాన్యులు నింగిలోకి వెళ్లడం ఇదే తొలిసారి.