అమెరికాలో కరోనా టెన్షన్ : 99శాతం డేల్టా వేరియంట్లే !

అమెరికాను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్‌. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మరణాలు ఆందోళన కల్గిస్తోంది. నిత్యం రెండు వేల మందికి పైగా వైరస్ బారినపడి చనిపోతున్నారు. ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియాలో మరణాల రేటు ఎక్కువగా ఉంది.డెల్టా వేరియంట్‌ కారణంగానే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయ్‌. కొత్త కేసుల్లో 99శాతం డేల్టా వేరియంట్లేనని అమెరికా వ్యాధి నియంత్రణ సంస్థ చెప్పింది. కరోనా కేసులు పెరగడంతో ఇటీవల నిబంధనలు కఠినతరం చేశారు. ఐతే కొత్త కేసుల నమోదు కాస్త తగ్గడంతో మళ్లీ సడలించారు.

దీంతో కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయ్‌. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నప్పటికీ. మరణాల రేటు పెరగడం ఆందోళన కల్గిస్తోంది.