రాష్ట్రీయ బాల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు-2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ప్రకటించింది. బాలల సంక్షేమం-అభివృద్ధి కోసం పని చేసిన సంస్థల నుంచి వచ్చే నెల 15 వరకూ నామినేషన్లు తీసుకోనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ అధికార వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది.