ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) నేడే ప్రారంభం..!

ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) ను ఈ రోజు ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మత్స్య రంగం సుస్థిరభావివృద్ధికోసం తీసుకొచ్చిందే పీఎంఎంఎస్​వై. అలాగే రైతులకు నేరుగా ఉపయోగపడే సమాచారాన్ని అందించే బ్రీడ్ మెరుగుదల మార్కెట్ ప్లేస్ పోర్టల్ ఈ -గోపాల యాప్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్​లో భాగంగా ఐదేళ్లలో మత్య్య రంగానికి రూ.20,050కోట్ల పెట్టుబడి అంచనాతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్రం.

PMMSY కింద ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇందులో సుమారు 12,340 కోట్లను మెరైన్, ఇన్ ల్యాండ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ రంగాలకు కేటాయించారు. 7710కోట్ల రూపాయలను మత్స్య రంగంలో మౌళిక సదుపాయాల అభివృద్దికి కేటాయించనున్నారు. ఆన్​లైన్​లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి, బిహార్ గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.