దీపాలను వెలిగిద్దాo.. ప్రజలకు పవన్ పిలుపు

ఆంద్ర ప్రదేశ్ లో అంతర్వేది ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. రథం దగ్ధం వెనక కుట్రం ఉందని బీజేపీ, జనసేన, టీడీపీ ఆరోపించడం.. ఛలో అంతర్వేదికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించగా.. చలో అంతర్వేది కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు, కానీ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ.. ఈ రోజు సాయంత్రం అందరూ దీపాలు వెలిగించాలని జనసేనాని పిలుపునిచ్చారు. సాయంత్రం 05.30 నుంచి 06.00 గంటల మధ్య దీపారాధన చేసి #Bharathiya_culture_matters హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు.

దర్యాప్తు అంటే గొడవ జరిగిందని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే , మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. దాని వైపు వేసే తొలి అడుగే ఈ కార్యక్రమం. భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడని జనసేన కోరుకుంటోంది. అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.