‘సిసింద్రీ’ కి మరోసారి అమ్మగా ఆమని
అక్కినేని వారసుడు అఖిల్ చిన్ని ‘సిసింద్రీ’ గా ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తీసిన చిత్రం సిసింద్రీ. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తవడం విశేషం. ఈ సందర్బంగా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఈ సినిమాలో తల్లి పాత్రలో తనదైన శైలి తో నటించి మెప్పించిన ఆమని పాల్గొంది. ఈ సందర్భంగా ఆమని సిసింద్రీ సినిమా కోసం బుల్లి అఖిల్‌తో పని చేసిన అనుభవాలను పంచుకుంది. అఖిల్‌కు ఇప్పుడు మళ్లీ అమ్మగా నటిస్తున్నట్లు కూడా వెల్లడించింది.
ఆమని తన మాటల్లో.. సిసింద్రీ సినిమాలో అఖిల్‌కు అమ్మ పాత్ర చేయాలని నాగార్జున అడిగిన వెంటనే ఒప్పుకున్నా. చాలా కష్టపడి సిసింద్రీ చేశాం. 30 రోజుల్లో సినిమా అనుకుంటే 60 రోజులైంది. చిన్న పిల్లాడితో షూటింగ్ అంటే అలాగే ఉంటుంది. అఖిల్ పడుకున్నపుడు మేం కూడా విశ్రాంతి తీసుకునేవాళ్లం. వాడికి మూడ్ వచ్చినపుడు షూట్ చేసేవాళ్లం. అఖిల్‌కు అందరూ సహకరించారు. సిసింద్రీ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు సమయమే తెలియలేదు. నా సొంత బిడ్డ లాగే అనిపించాడు అఖిల్. నన్ను అమ్మలాగే భావించేవాడు. అమ్మా అనే అనేవాడు. ఇప్పటికీ ఎప్పుడు కలిసినా వెతుక్కుంటూ వచ్చి మాట్లాడతాడు. నన్ను అమ్మఆ అని హత్తుకుంటాడు. అంతకంటే ప్రేమ ఇంకెక్కడా నేను చూడలేదు. అది తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉందో ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు కూడా అఖిల్‌కు తల్లిగా ఓ సినిమా చేస్తున్నాను. అఖిల్‌ను ఇప్పుడు చూసినా నాకు చిన్న బాబులాగే కనిపిస్తాడు అని ఆమని చెప్పింది.