కృష్ణా జిల్లాలో మారుమోగిన టీం పిడికిలి వారి సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాల్..! పోస్టర్స్ విడుదల కార్యక్రమం
కృష్ణా జిల్లా లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి టీం పిడికిలి లీడ్స్ మరియు కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జిల్లా అధికార ప్రతినిధులు, అన్ని మండల అధ్యక్షులు, మరియు అన్ని నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి నాయకుల సమక్షంలో ఆదివారం సాయంత్రం జిల్లా పార్టీ ఆఫీస్ లో జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ టీం పిడికిలి వారి సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాల్..! పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఇస్తున్న వారిలో ఒక్కరినీ అయినా రైతు కాదు అని నిరూపించే దమ్ము వైసీపీ కి ఉందా అంటూ టీం పిడికిలి పోస్టర్స్, స్తిక్కర్స్ కనీ వినీ ఎరుగని రీతిలో విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రరాష్ట్రం నడిబొడ్డు జిల్లా అయిన కృష్ణా జిల్లా నుండి వైసీపీ అధినేత అయిన సిబిఐ దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డి కి మరియు కృష్ణా జిల్లా మరియు మిగిలిన 12 జిల్లాల లో ఉన్న వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ సవాలు విసురుతూ సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాలు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా కృష్ణా జిల్లా టీం పిడికిలి టీమ్ మరియు కృష్ణా జిల్లా జనసేన పార్టీ దమ్ము చూపించింది.