అనంతపురం జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

*ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం… పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రతిజ్ఞ చేద్దాం..

*రానున్న మంచి రోజుల్ని దృష్టిలో పెట్టుకుని ఉరకలెత్తే ఉత్సాహంతో ప్రతి ఒక్కరం పని చేద్దాం…

అనంతపురం నగరంలోని జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేసి.. సభ్యత్వ వాలంటీర్లను సత్కరించిన అనంతపురం అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో నేడు అనంతపురం నగరంలోని క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లను పంపిణీ చేసి.. అత్యధికంగా సభ్యత్వలు చేసినటువంటి రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ, రవికుమార్ లను మరియు వాలంటీర్లను శాలువాతో, పార్టీ జెండాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలిచే పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సభ్యులకు ఏదైనా జరిగితే ఆర్థికంగా అండగా ఉండేలా రూపొందించిందే క్రియాశీలక సభ్యత్వం అని అన్నారు. గడచిన రెండేళ్ళలో ప్రమాదానికి గురైన కార్యకర్తలకు 50వేల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అందిస్తూ పార్టీ తోడుగా నిలవడం జరిగిందన్నారు. పార్టీ సభ్యులకు ఏ కష్టం వచ్చినా తోడుగా నిలవాలని, కార్యకర్తల ఇంట్లో కుటుంబసభ్యునిగా మమేకం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు నిత్యం తమకు చెప్తుంటారని వివరించారు. నగరంలోని ప్రతి కార్యకర్త సంక్షేమానికి తోడుగా ఉంటున్నామని, సమస్యలు ఏర్పడినపుడు అండగా నిలుస్తామని, అక్రమ కేసులు బనాయిస్తే పోలీసు స్టేషన్ల ఎదుట పోరాడిన సందర్భాలు ఉన్నాయని.. కోర్టులో న్యాయ పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయని కొన్ని ఉదాహరణలను కార్యకర్తలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారే అని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవని, మనవంతుగా మనం ఆ దిశగా ప్రజల వైపు, ప్రజా సమస్యల పరిష్కారం వైపు బలంగా నిలబడితే చాలు అని కార్యకర్తలకు సూచించారు. రానున్న మంచి రోజుల్ని దృష్టిలో పెట్టుకుని ఉరకలెత్తే ఉత్సాహంతో ప్రతి ఒక్కరం పని చేద్దాం అని జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ కార్యకర్తలకు తెలిపారు. ఈ సందర్భంగా నగర్ కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ను గజమాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, ఉపాధ్యక్షులు సదానందం, గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేశులు, వెంకట్ నారాయణ, చక్రపాణి, హుస్సేన్, కాలేశా, ధరాజ్ భాష, కార్యదర్శులు విశ్వనాధ్, రాజేష్ కన్నా, సంపత్, మురళి, అంజి, ఆకుల ప్రసాద్, ఆకుల అశోక్, శేషాద్రి, ప్రాంతీయ కమిటీ మహిళా సభ్యులు, పెండ్యాల శ్రీలత, పసుపులేటి పద్మావతి, వీర మహిళలు అనురాధ, మరిశెట్టి రూపా, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు రాప ధనుంజయ్, కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, నాయకులు ముప్పూరీ కృష్ణ, పవనిజం రాజు, సంతోష్, వీర మహిళలు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.