రాని పథకాలను వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులు

*గడపగడపకు వైయస్సార్ కార్యక్రమంలో కరపత్రాలు పంచి వారికి రాని పథకాలను వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులు.

కైకలూరు నియోజకవర్గం, కైకలూరు మండలంలోని, నత్త గుల్లపాడు గ్రామంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది రాజావారి చేపల చెరువు సినిమాలోని లేని చేపల చెరువుకు తవ్వడానికి అన్ని డిపార్ట్మెంట్లు పరిమిషన్ ఇచ్చినట్లు ఆ చెరువు ని ఎవరో కిడ్నాప్ చేశారని తమ చెరువు ఎక్కడుందో వెతికి పెట్టాలని.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సీను మన కైకలూరు నియోజకవర్గం నత్త గుల్లపాడు గ్రామంలో కనిపించింది. వివరాల్లోకి వెళితే గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు దానిలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంచి వారికి ప్రభుత్వ నుండి ఏమేమి పథకాలు వచ్చాయో వాటిని కూడా చేసి ఒక కరపత్రం రూపంలో వారికి అందజేశారు. అధికార పార్టీ నాయకులకు వెళ్లిపోయిన తర్వాత కరపత్రాలు చదువుకున్నవారికి కళ్ళు తిరిగే నిజాలు వారికి కనిపించాయి వారికి ఇళ్ల స్థలం రాకుండానే వచ్చినట్లుగా వారికి రాని ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి లోను పొందినట్లుగా వారు ఇచ్చిన పత్రంలో ఉంది సుమారుగా ఇదే విధంగా గ్రామంలో 41 మందికి ఇదే విధంగా వచ్చాయి వారు ప్రభుత్వం నుండి మాకు రావలసిన పథకాలు రాకుండా ఎవరో మధ్యలో దళారులు మాకు రావలసిన సంక్షేమ పథకాలు డబ్బును ఎవరు జేబులోకి వెళ్లాయో విచారణ చేయాలని తమ ఇట్టి స్థలం ఎక్కడుందో చూపించాలని ఇంటి స్థలం ఇవ్వకుండానే డబ్బులు ఎవరికి ఇచ్చారు విచారణ చేయాలని తమకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే తముకు న్యాయం చేయాలనిగ్రామానికి చెందిన మొరు సత్యవతి వనమాల అనురాధ గోవింద రమణ అనే వ్యక్తులు వీడియో రూపంలో వారి బాధను సోషల్ మీడియా ద్వారా వారి బాధను తెలియజేశారు.