జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

రామగుండం, జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనల మేరకు జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన మరియు వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత జీవితం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వసిపి పార్టీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం సాయంత్రం రామగుండం నియోజకవర్గం రామగుండం పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గ నాయకులు చెట్టి రాజశేఖర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం జనసేన నాయకులు పుష్పక అభిలాష్, ఇరికిల్ల కీర్తి చందు, మాడుగుల పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది.