వర్షాకాలం పంటల కొనుగోలుపై నేడు సీఎం సమీక్ష

సీఎం కెసిఆర్ ఈ రోజుమరో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలం పంటల కొనుగోలుపై మధ్యాహ్న 2.30గంటలకు ప్రగతి భవన్‌లో సమీక్ష జరుగనుంది. సమావేశానికి వ్యవసాయశాఖ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయాశాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సీఎం చర్చించనున్నారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లు, యాసంగిలో పంటల సాగుపై సీఎం చర్చింనున్నారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. సమగ్ర వివరాలతో సమావేశానికి రావాల్సిన అధికారులను ఆదేశించారు. గతేడాది ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారు?.. ఎంత ధర వచ్చింది? తెలుపాలని, యాసంగి మక్కల సాగులో లాభమా..నష్టామా?.. ప్రస్తుత మార్కెట్‌పై తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం సీఎం కెసిఆర్ తీసుకుంటారు.