అభాగ్యులకు అండగా జనసేన

  • వజ్రోత్సవ సందర్బంగా సహాయం అందించిన జనసేన
  • పల్లెపల్లె కు మహర్దశను తీసుకు రావడమే లక్ష్యం
  • మహనీయుల అడుగు జాడల్లో నడవడమే ద్యేయం
  • జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్న

కార్వేటి నగరం మండలం, గోపిశెట్టి పల్లి పంచాయతీ, ఈదువారి పల్లి ఏఏడబ్ల్యు గ్రామంలో గతంలో చెంగయ్య అనే నిరుపేద అనారోగ్యంతో బాధపడుతుంటే, జిల్లా అధ్యక్షులు డా.హరిప్రసాద్ ద్వారా శస్త్ర చికిత్స చేయడం జరిగింది. అనేక మార్లు జనసేన ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగిందని నియోజకవర్గం ఇంచార్జి డా యుగంధర్ పొన్న తెలిపారు. ఈ సందర్బంగా డా యుగంధర్ పొన్న మాట్లాడుతూ… 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా చెంగయ్యకు మెరుగైన ఆరోగ్యం కొరకు మందుల కొనుగోలు కోసం ఆరువేలు ఆర్ధిక సహాయం జనసేన ఆధ్వర్యంలో అందించారు. ప్రతి గ్రామం సస్యశ్యామలం కావాలంటే పల్లె పల్లెకు మహర్దశను తీసుకు రావాలని అది జనసేన ద్వారా మాత్రమే సాధ్యమని తెలియజేసారు. అప్పుడే సర్వ రంగ సమగ్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామంలోనే ఉదయమేమండల కమిటి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ మహనీయుల అడుగుజాడల్లో నడవడమే ద్యేయమని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు విజయ్ శ్యామ్ ప్రసాద్, వెంకటేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నరసింహ, హరీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసేన నాయకులు మోహన్ రెడ్డి, అజిత్, మధు, నరేష్, జనసైనికులు, గ్రామస్తులు ఉన్నారు.