పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

కోనసీమలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈదరపల్లి అయ్యప్ప స్వామి గుడిలో పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం గడియార స్తంభం సెంటర్లో సభ ఏర్పాటు చేసి తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన కేక్ కట్ చేసారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నప్రసాద వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్, ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కొమ్ముల ధన్వంతరి నాయుడు, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు యేడిద శ్రీను, పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు నల్లా చిట్టిబాబు, నల్లానాయుడు, యాళ్ల నాగ సతీష్, ఇసుక పట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, లింగోలు పండు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, డాక్టర్ నాగ మానస, మహాదశ నాగేశ్వరరావు, పడాల నానాజీ, గండి స్వామి, పిండి రాజా, వర్రే శేషు, బట్టు పండు, నల్లా మల్లిబాబు, తిక్కా సరస్వతి, బండారు వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వంటెద్దు బాబీ పాల్గొన్నారు.