చరిత్ర సృష్టించిన కమలా.. బైడెన్ విజయంపై హర్షం

కమలా హ్యారిస్ అమెరికాలో చరిత్ర సృష్టించారు. అమెరికాకు మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నికయ్యారు. అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడంతో గతంలో ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును కమలా హ్యారిస్ సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు అమెరికాలో అంత అత్యున్నత స్థాయి పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన మహిళగా కమలా హ్యారిస్ రికార్డు సృష్టించారు. కమలా హ్యారిస్ ఖ్యాతి భారత సంతతి మహిళ అనే పేరుతో ఆగిపోలేదు. ఆ పదవికి ఎన్నికైన తొలి సౌత్ ఆసియన్-అమెరికన్ మహిళ కూడా ఆమె అయ్యారు.

అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించడంపై ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ హర్షం వ్యక్తం చేశారు. బైడెన్ విజయం అమెరికన్ల ఆత్మకి సంబంధించిందని అన్నారు. తాము అమెరికాకు చేయాల్సింది ఎంతో ఉందని చెప్పారు. ఈమేరకు ఆమె ఏ ప్రెసిడెంట్ ఫర్ ఆల్ అమెరికన్స్ పేరుతో వీడియో సందేశం పంపారు.