యడ్ల నవీన్ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన పితాని

ముమ్మిడివరం, జనసేనపార్టీ పిఏసి సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ ఇటీవల కాట్రేనికోన మండలం దొంతుకూరు గ్రామంలో ఉన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ నిర్లక్ష్యం, అలాగే విద్యాశాఖ, అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ ఘాతూకం జరిగి ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సంఘటనలో యడ్ల సత్యనారాయణ నాగమణి దంపతుల కుమారుడు యడ్ల నవీన్ మృతి చెందాడు మృతుని కుటుంబసభ్యులను పితాని బాలకృష్ణ పరామర్శించి ఓదార్చి ఆర్ధిక సాయం చేశారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రూపాయలు అదేవిధంగా గాయపడిన విద్యార్థులకు ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఇప్పటివరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందించలేదు అదే విధంగా మృతి చెందిన నవీన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని అలాగే ప్రభుత్వం ప్రకటించిన సహాయం తక్షణం అందించాలని అదేవిధంగా మృతి చెందిన కుటుంబసభ్యులు నివసించే గృహానికి పట్టమంజూరు చేయాలని అదే విధంగా ఆ గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేదు తక్షణం ప్రభుత్వం ఆ ప్రాంతానికి రోడ్డు సదుపాయం కల్పించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరివెంట మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్, మాజీ సొసైటీ అధ్యక్షులు శీలం సూర్యనారాయణ, మండలకార్య నిర్వాహక కార్యదర్శి సంసాని పాండురంగారావు, కార్యదర్శి పిల్లి గోపి, గిడ్డి ఏడుకొండలు(ఏసిఎఫ్), ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, నందికి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.