కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌కు ‘వటాయన్’ పురస్కారం

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ చేసిన రచన, కవిత్వం, సాహిత్యానికి ‘వటాయన్‌’ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఈ అవార్డును ఈనెల 21న లండన్‌లో నిర్వహించే సమావేశంలో మంత్రికి ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ 75 పుస్తకాలపైనే రాశారు. ఆయనకు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కాయి. అప్పటి ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి చేతుల మీదుగా సాహిత్య భారతి అవార్డు, అప్పటి రాష్ట్ర్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా సాహిత్య గౌరవ్‌ సమ్మాన్‌ అవార్డు అందుకున్నారు. దుబాయి, మారిషస్‌, ఉక్రేయిన్‌, నేపాల్‌ దేశాల నుంచి గౌరవ అవార్డులను కూడా స్వీకరించారు. ఆయన రచనలు చేసిన పలు పుస్తకాలు పలు భాషల్లో అనువాదం అయ్యాయి. కవితలు, రచనా సాహిత్యంలో కృషి చేసిన వారికి వటాయన్‌ జీవితకాల సాఫల్య పురస్కారం అందిస్తారు.