ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి స్వామినాథన్ మృతి

ఎన్నికల ప్రచారం చేస్తూ ఓ బీజేపీ అభ్యర్థి స్వామినాథన్ మృతి చెందారు. ప్రచారంలో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే మృతి చెందారు. కేరళలోని కొల్లం జిల్లాలో జరిగిందీ ఘటన. మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత విశ్వనాథన్ కొల్లం జిల్లాలో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కొల్లం జిల్లాలో పర్యటించారు. క్యాంపెయినింగ్‌లో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే ఉన్నట్లుండి మైక్ వదిలేసి స్టేజిపై పడిపోయారు. దాంతో వెంటనే ఆయన అనుచరులు, పక్కనున్న కార్యకర్తలు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే విశ్వనాథన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.