ఇక పై నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే ఎంట్రీ..!

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్‌, గుజరాత్‌, గోవా రాష్ట్రాల నుంచి విమానాలు, రైళ్లు, రోడ్డు మార్గాన మహరాష్ట్రకు వచ్చే ప్రయాణికులు కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాల్సిందేనని స్పష్టం చేసింది. విమానం ఎక్కేసమయంలో అక్కడి ఎయిపోర్టుకు అధికారులకు, ముంబైలో దిగాక అక్కడి అధికారులకు విమాన ప్రయాణికులు నెగెటివ్‌ రిపోర్టు విధిగా చూపించాలని సూచించింది. కొత్త నిబంధనలు ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొంది. ఈ మేరకు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) సోమవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా పంజా విసురుతుండడంతో.. కట్టడి చర్యలను ఆయా రాష్ట్రాలు పూనుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఆది నుంచి కరోనా కేసులు సంఖ్య పెద్ద సంఖ్యలో నమోదవుతూ వచ్చి ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే.