రామచంద్ర యాదవ్ ను పరామర్శించిన జనసేన నాయకులు

  • పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటి పై దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు

చిత్తూరు జిల్లా, పుంగనూరులో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కొందరు దండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ రామచంద్ర యాదవ్ ను పరామర్శించడం జరిగింది. హరి ప్రసాద్ వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ పొన్న మరియు జిల్లా నాయకులు ఉన్నారు.