వినగడప గ్రామములో ఘనంగా జనసేన జెండా దిమ్మ ఆవిష్కరణ

  • వైసీపీ, టీడీపీ, సీపీఎం పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరిక

తిరువూరు నియోజకవర్గం: గంపలగూడెం మండలం, వినగడప గ్రామములో గంపలగూడెం మండల జనసేన నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జండాదిమ్మను జిల్లా అధ్యక్షులు ఆవిష్కరించారు. తదుపరి ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, ఉమ్మడి కృష్ణ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీ, కృష్ణ – పెన్నా కో ఆర్డినేటర్ రావి సౌజన్య మరియు జిల్లా కార్యవర్గం సమక్షంలో వైసీపీ, టీడీపీ, సీపీఎం పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజు రోజు కి బలపడుతుంది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహంతో వున్నారు. వైసీపీ, టీడీపీ నుండి జనసేన పార్టీ లోకి రావడం పార్టీకి మరింత బలం చేకూర్చింది. వైసీపీ పార్టీ పతనం మొదలు అయ్యింది. గ్రామాల్లో కూడా మార్పు మొదలయ్యింది. ప్రజలు అందరూ జనసేన పార్టీ వైపు చూస్తున్నారు 2024 ఎన్నికల్లో తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం స్థాపిస్తుంది. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కోసం ఎంత కష్టపడుతూన్నారో అతని జీవితం జనం కోసమే. ఈ నియోజకవర్గంలో కూడా కిడ్నీ భాదితులు వున్నారు. మొట్ట మొదటి సారి కిడ్నీ భాదితులు కోసం పోరాడింది పవన్ కళ్యాణ్ గారే అని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మనం అందరం బాగుంటాము, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ కి ఓటు వేసి 2024 లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం గద్దె ఎక్కిద్దాం అని రామకృష్ణ అన్నారు.. జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ.. వినగడప గ్రామములో జనసేన పార్టీ జండాదిమ్మ ఆవిష్కరణ, జనసేన పార్టీలో చేరికలు జరుగుతుంది అని తెలిసి ఒక రోజు ముందు స్థానిక ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు ఇక్కడకు వచ్చి ప్రజల్ని బయపెట్టాలని చూసారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు రాకుండా చెయ్యాలని చూసారు. మీరు ఆ కార్యక్రమాలకు వెళ్తే మీ పథకాలు తీసేస్తాం అని బెదిరించినా.. వినగడప గ్రామ ప్రజలు అవి ఏమి పట్టించుకోకుండా వైసీపీ, టీడీపీ నుండి భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరడం అంటే మాములు విషయం కాదు. అంటే వైసీపీ ప్రభుత్వం నుండి ప్రజలు ఎంత విసిగిపోయారో అర్థం అవుతుంది. వినగడప ప్రజలు జనసేన పార్టీలో చేరడం చాలా ఆనందాన్ని కల్గించింది. జనసేన పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం. మూడున్నర సంవత్సరాలు నుండి ప్రజలకు మీరు ఎలాంటి న్యాయం చేశారు, వినగడప గ్రామము నుండి గంపలగూడెం వెళ్లే మెయిన్ బ్రిడ్జి (వంతెన) కోసం గ్రామ ప్రజలు దశాబ్దాల కాలం నుండి పోరాడుతున్నారు. వర్షకాలం వస్తే నీటి ప్రవాహం వలన ఆ ఊరికి ఈ ఊరికి వెళ్లలేని పరిస్థితులు వినగడప నుండి గంపలగూడెం వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు వెళ్ళాలి. కసిని వర్షా కాలంలో వరదలు వస్తే 50 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళాలి. వినగడప ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో గంపలగూడెం వెళ్లాలంటే ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి. అదే జనసేన పార్టీ ప్రభుత్వం వస్తే ఆ వంతెన త్వరలోనే పూర్తి చేస్తాం అని ప్రజల్ని ఉద్దేశించి బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బండ్రేడ్డి రవి, లోకేష్, గోవర్ధన్, ఉరిమి సురేష్, శివరామకృష్ణ, రెడ్డిమని, మహిళా నాయకులు సుజాత, గంపలగూడెం మండల అధ్యక్షులు వెంకట కృష్ణ, విస్సన్నపేట మండల అధ్యక్షులు యాసిన్, గాదేవారి గూడెం ప్రెసిడెంట్ చెన్నూ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు జయప్రకాష్, వట్టికుంటా కృష్ణ, పడగల లక్ష్మణ రావు, తోట రామకృష్ణ మరియు మండల కార్యవర్గం పాల్గొన్నారు.