గాయపడిన వ్యవసాయ కార్మికునికి ఆర్థికసహాయం అందించిన జ్యోతుల

పిఠాపురం నియోజవర్గం: పిఠాపురం రూరల్ మండలం విరవ గ్రామానికి చెందిన కమ్మర రామకృష్ణ బైక్ యాక్సిడెంట్ కారణంగా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఇంటి వద్ద వైద్యసహాయం పొందుతున్నారు. ఆయన రెండు కాళ్ళుకు బలమైన గాయాలు కావడం వల్ల 3 నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా మేరకు ఇంటి వద్దనే వైద్య సహయం తీసుకుంటున్నారు. కమ్మర రామకృష్ణ రోజువారి వ్యవసాయకూలీ, ముగ్గురు చిన్న వయసున్న ఆడపిల్లలతో ఉన్నా బీదకుటుంబం. కమ్మర రామకృష్ణ పరిస్థితిని విరవ గ్రామానికి చెందిన జనసైనికులు ద్వారా విషయం తెలుసుకొని శుక్రవారం సాయంత్రం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు విరవ గ్రామంలో గల కమ్మర రామకృష్ణ గృహానికి వెళ్లి కమ్మర రామకృష్ణను యాక్సిడెంట్ వివరాలు అడిగి తెలుసుకుని తక్షణ సహాయంగా కిరాణాసామాన్లు, 25 కేజీల బియ్యం, రెండు వేల రూపాయలు సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో కమ్మర రామకృష్ణ భార్య సుధారాణి, పెదపాడు దుర్గాప్రసాద్, కుంచె అశోక్, కమ్మరి శ్రీను, నేలపల్లి ఏసుబాబు, కమ్మర నాగేశ్వరరావు, నూతటి చిన్ని, కమ్మర వీరభద్రరావు, చెల్లి లక్ష్మి, కమ్మర సుదర్శన్ రావు, నేలపల్లి చిన్నారి, కమ్మర సూర్యుడు, మొగిలి శ్రీను, జ్యోతుల సీతారాంబాబు, కీర్తి చిన్న, మేడిబోయిన హరికృష్ణ, కోలా నాని తదితరులు పాల్గొన్నారు.