ఏలూరు ప్రజలఅస్వస్థతకు కారణం.. “లెడ్” హెవీ మెటల్‌

ఏలూరు ప్రజలు ముూర్ఛ ఇతరత్రా లక్షణాలతో అస్వస్థతకు గురికావడానికి ముఖ్య కారణం లెడ్, నికెల్ వంటి హెవీ మెటల్స్ అని నిపుణులు తేల్చారు. ప్రధానంగా లెడ్ అనే భార లోహమే కీలక కారణమని తేలింది. అనారోగ్యం బారిన పడిన వారి బ్లడ్ శాంపిల్స్‌లో… లెడ్, నికెల్ ఉన్నట్లు… ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు జరిపిన పరీక్షల్లో తేలింది. ‘లెడ్’ బ్యాటరీస్‌లో ఉండే పదార్ధం. ఈ హెవీ మెటల్  ప్రమాదకరమైనది. ఇది మనుషుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అంటే… మన శరీరంలోకి లెడ్ వెళ్తే… మెదడు సరిగా పనిచెయ్యదు. దాంతో ఫిట్స్ వచ్చేస్తుంది. అంతేకాదు… తలనొప్పి, మతిమరపు లక్షణాలు కూడా వస్తాయి. ఇక ఇన్ని వచ్చాక… నీరసం ఇతరత్రా రావడం పెద్ద మేటరేమీ కాదు. ఏలూరులో బాధితులకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అందువల్ల ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు చెబుతున్నది నిజం అని నమ్మొచ్చు. ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

 “లెడ్” బ్యాటరీస్‌లో ఉండే పదార్ధం. ఇది తాగు నీటి ద్వారా, లేదా పాల ద్వారా పేషెంట్స్ శరీరంలో వెళ్లి ఉండవొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. సాంపిల్స్ టెస్ట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ మంగళగిరి ద్వారా అందజేయటం జరిగింది. వెంటనే ఏ మార్గం ద్వారా వారి శరీరాల్లో ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్థానికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. వాటర్, పాల శాంపిల్స్ పంపించాలని ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడుగుతోంది. మెటల్స్ ను డిటెక్ట్ చేసే అధునాతన పరికరాలు ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే ఉన్నాయి. ఇక ఈ రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించాల్సి ఉంది.