సీతానగరం మండలం గడ్డ… జనసేన అడ్డా…!

  • పవన్ కళ్యాణ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న మేడ గురుదత్ ప్రసాద్ కి ఘనస్వాగతం పలికిన సీతానగరం మండల జనసైనికులు.
  • జనసేన పార్టీలోకి నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కానీ జనసేన పార్టీ బలం జనసైనికులే “మేడ”

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం కొరకు జనసైనికులకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రజానాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చే విధంగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. అనంతరం జెండా ఆవిష్కరణ, భారీ బహిరంగ సభ వందలాదిగా జనసైనికులు ఈ సభలో పాల్గొన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొణిదెల పవన్ కళ్యాణ్ ని చూడడమే మన ప్రధాన లక్ష్యం, ఈ లక్ష్యసాధనలో జనసేన పార్టీ కోసం పనిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రేడి శీను, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, కొవ్వూరు జనసేన పార్టీ నాయకులు సీతాలు, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయశంకర్, రాజానగరం మండల అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళలు కందికట్ల అరుణ, సీతానగరం మండల కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, తణుకు రమేష్ బాబు, బెల్లపు విజయ, కామిశెట్టి హిమశ్రీ, రాజానగరం నియోజకవర్గం ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ జమాల్ హాలీ (సోను), రాజానగరం నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, చిడిపి రమేష్, దుబాయ్ శ్రీను, అప్పయమ్మ (ప్రసాద్), డిబాయ్ శ్రీను, రాజు, గేదల సత్తిబాబు, రాజానగరం మండల కో- కన్వీనర్ నగవరుపు భాను శంకర్, రాజానగరం ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి విష్ణుచక్రరావు, కోరుకొండ మండల సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, చదువు నాగు, తెలగంశెట్టి శివ, భారీ ఎత్తున జనసైనికులు, వీరామహిళలు, జనసేన పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.