కిరణ్ రాయల్ కేస్ పై నగిరి పోలీసుల అత్యుత్సాహంపై హైకోర్టు ఆంక్షలు

*మంత్రి రోజా మరియు ధర్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని జనసేన నాయకులు కిరణ్ రాయలపై నగిరి పోలీసులు పలు సెక్షన్ లపై కేసు నమోదు

*తమ ప్రాంత మంత్రిని అవమానపరిచాడంటూ సాయి సంధ్యారాణి అనే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు

*పోలీసులు తనపై పెట్టిన కేసు అక్రమం అంటూ హైకోర్టును ఆశ్రయించిన జనసేన నాయకులు కిరణ్ రాయల్

*పిటిషనర్ తరపున వాదనను వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

*యూట్యూబ్లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలపై పోలీసులు కేసు నమోదు చేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టిన పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

*మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా కిరణ్ రాయల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఫారెన్సీక్ లేబరేటరీ కి పంపాలన్న పోలీసు చర్యలపై హైకోర్టు ఆంక్షలు

*నగిరి మెజిస్ట్రేట్ ఇచ్చిన షోకాస్ నోటిస్ ఆధారంగా కోర్టు అనుమతి లేకుండా మొబైల్ ఫోన్ ఎలా ఎఫ్ ఎస్ ఎల్ పంపిస్తారంటూ ప్రశ్నించిన హైకోర్టు

*తమ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్ నుండి ఎటువంటి డేటా బయటికి తీసే ప్రయత్నాలు చేయవద్దు అంటూ పోలీసుల చర్యలను నిలువరించిన హైకోర్టు

*స్టేట్ ఫారెన్సీక్ లేబరేటరీ కి కూడా తమ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్ నుండి ఎటువంటి డేటా బయటికి తీయవద్దు అంటూ ఆదేశాలు

*కేసు విచారణ ఎల్లుండికి వాయిదా