చిత్రపురి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వినోద్‌బాల ప్యానల్‌

 చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో ఎన్నికల్లో వినోద్‌బాల మార్నేని ప్యానల్‌ ఘన విజయం సాధించింది. 11 మంది పోటీ చేయగా 10 మంది గెలుపొందారు. జనరల్‌ కేటగిరిలో వల్లభనేని అనిల్‌కుమార్‌, అనుముల మహానందరెడ్డి, ఆళహరి వీవీ ప్రసాదరావు, కాదంబరి కిరణ్‌, కొంగర రామకృష్ణ ప్రసాద్‌, దొర పీఎ్‌సఎన్‌, వి.ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌, మహిళా కేటగిరిలో అనిత నిమ్మగడ్డ, దీప్తి వాజ్‌పేయి, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో టి. లలిత గెలుపొందారు. కొమురం వెంకటేష్‌ ప్యానల్‌ నుంచి జనరల్‌ కేటగిరిలో రఘు బత్తులు విజయం సాధించారు.

చిత్రపురికాలనీ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాలుగు ప్యానళ్లతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 65 మంది పోటీ చేశారు. 8 మంది జనరల్‌ కేటగిరి, మహిళా కేటగిరిలో ఇద్దరు, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో ఒకరు ఉన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ జరిగింది.  చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో 4,800 మందికిపైగా సభ్యులు ఉన్నారు. వీరిలో 2,400 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి ఎలక్షన్‌ అథారిటీ అడిషనల్‌ రిజిస్ట్రార్‌ సుమిత్ర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.