చెత్త డంపింగ్ కు ప్రత్యేక యంత్రాలు

ఆదర్శనగర్‌ లోని చెత్త డంపింగ్‌ యార్డును మేయర్‌ బొంతు రామ్మోహన్‌ గురువారం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త డంపింగ్‌ చేయకుండా స్పెషల్‌ యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. చెత్త సేకరణ సిబ్బంది రిక్షాల ద్వారా నేరుగా యంత్రాల వద్దకు తీసుకెళ్లి చెత్తను వేరు చేస్తారన్నారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు చెత్తను పూర్తిగా తొలగించామన్నారు. అధికారులు స్థానికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు, వివిధ కాలనీల నుంచి తీసుకొచ్చే చెత్తను ఓకే దగ్గర డంపింగ్‌ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డీసీసీ శంకర్‌, ఏఈ సత్యలక్ష్మి, టీఆర్‌ఎస్‌ నాయకులు నాగిళ్ల బాల్‌ రెడ్డి, శివ కుమార్‌ గౌడ్‌, బాబు, రాజేశ్వర్‌ రెడ్డి శ్రీకాంత్‌ రెడ్డి, పాల్గొన్నారు.