వైశ్యులను గౌరవించిన జనసేనని ఆదరించి బలపరచవలసినదిగా వైశ్య వర్గాలను కోరుతున్నా: ముత్తా శశిధర్

కాకినాడ సిటి జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మచిలీపట్నంలో నిర్వహించడానికి నిర్ణయించి దానికి అమరజీవి పొట్టి శ్రీరాములు సభావేదికగా నామకరణం చేయడంపై జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ముత్తా శశిధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆది నుండి జాతీయ నాయకుల మరియు దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి మహనీయులు చేసిన త్యాగాలను యువతరానికి చాటిచెప్పాలన్న స్ఫూర్తితో జనసేన పార్టీ సభలకు వారి పేరు పెట్టి వారిని గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది అని అన్నారు. ఒకవైపు ఈ వై.సి.పి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరు నుండీ ఎన్టీఆర్ పేరుని తొలగిస్తే దానికి భిన్నంగా మచిలీపట్నంలో జరగనున్న జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ వేదికకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి వైశ్యులను గౌరవిస్తూ వారి ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ ది అన్నారు. ఇంతే కాకుండా సమాజంలో వైశ్యుల సేవలను, వారి ఉనికిని గుర్తిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో పి.ఏ.సి సభ్యుడిగా నియమించిన ఏకైక రాజకీయ పార్టీ జనసేన అని, ఇంతటి గుర్తింపుని ఇచ్చి వైశ్యులను గౌరవించిన జనసేన పార్టీని ఆదరించి బలపరచవలసినదిగా వైశ్య వర్గాలను కోరుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ళు పథకంలో ఈయేడు ఉగాది నాటికి 4 వేల ఇళ్ళు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పిన నాయకులు ప్రస్తుతానికి ఎన్ని ఇళ్ళు సిద్ధం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాకినాడ సిటి అధ్యక్షులు సంగిసెట్టి అశోక్, ఉపాధ్యక్షులు అడబాల సత్యన్నారాయణ, జనరల్ శెక్రటరీ వలీ భాషా, 21వ డివిజన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.