కొత్త స్ట్రెయిన్‌పై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల పరీక్షలు

కరోనా వైరస్ ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ రూపంలో మరోసారి ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్‌లో బయటపడ్డ కరోనా కొత్త స్ట్రెయిన్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటివరకు నాలుగైదు దేశాల్లో స్ట్రెయిన్ కేసులు గుర్తించడం జరిగింది. కొవిడ్ కంటే కూడా ఇది 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించడం జరిగింది. ఇక కరోనా కోసం పరిశోధకులు కనుగొన్న టీకాలు దీనిపై పని చేస్తాయా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ సంస్థలు త్వరలోనే కొత్త స్ట్రెయిన్‌పై తమ టీకాలను పరీక్షించనున్నట్లు తెలిపాయి. “ఇప్పటివరకు మా వద్ద ఉన్న డేటా ప్రకారం ఇటీవల యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్‌ను కూడా ఎదుర్కొనే ఇమ్యూనిటీని మోడెర్నా వ్యాక్సిన్ ఇవ్వగలదని మేము భావిస్తున్నాం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు రాబోయే కొన్ని వారాల్లోనే అదనపు పరీక్షలు నిర్వహించబోతున్నాం.” అని మోడెర్నా సంస్థ ప్రతినిధితులు ప్రకటించారు. అలాగే ఫైజర్ కూడా వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తపు నమూనాలు సేకరించి.. ఈ టీకా వారిలో ఎలా రోగనిరోధకతను కలిగిస్తోందో ఆ డేటాను పరిశీలిస్తోందని సమాచారం. దీని ప్రకారం కొత్త స్ట్రెయిన్‌ను సైతం ఈ టీకా న్యూట్రలైజ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందో లేదో పరీక్షించనుందట.