బంగారంతో తయారుచేస్తున్న బర్గర్లు..!

సాధారణంగా బర్గర్లు కాయగూరలు లేదా మాంసంతో చాలా టేస్టీ గా తయారు చేస్తారు. కానీ ఒక రెస్టారెంట్లో బర్గర్లను బంగారంతో తయారు చేస్తున్నారు. వీటిని బంగారంతో తయారుచేసిన కస్టమర్లు ఎంచక్కా తినొచ్చు. ఎందుకంటే ఈ బర్గర్ ల పై 24 క్యారెట్ గోల్డ్ పూతను పోస్టర్ తప్పించి మొత్తం బంగారంతో తయారు చేయరు. అయితే వీటి ధర అక్షరాలా $59.అంటే మన భారతీయ కరెన్సీలో రూ.4,300 రూపాయలు అన్నమాట.

ఈ బర్గర్ లో రెట్టింపు జున్ను, రెట్టింపు మాంసంతో పాటు 24 క్యారెట్ల బంగారపు పూత ఉంటుంది.  కరోనా వైరస్ కారణంగా బిజినెస్ బాగా నష్టపోయిన ఓ రెస్టారెంట్. తిరిగి తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి బంగారపు బర్గర్లు పేరిట సరి కొత్త రకం బర్గర్ ని తయారు చేసింది. వీటి గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియడం తో ప్రతి ఒక్కరూ బంగారపు బర్గర్లను టెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుంటే. కొలంబియా లోని బొగొటా అనే ప్రదేశంలో పేరుగాంచిన ఓరో మెక్ కాయ్ అనే ఓ రెస్టారెంట్ యాజమాన్యం బంగారు బర్గ‌ర్ల‌ను విక్రయించడం ప్రారంభించింది. వీటి గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ని కూడా విడుదల చేసింది. అయితే బంగారం తో బర్గర్లు తయారు చేస్తున్నారని తెలియగానే స్థానిక ప్రజలంతా రెస్టారెంట్ ముందు క్యూలో నిల్చొని మరీ బంగారపు బర్గర్లు ఆర్డర్ చేసి తింటున్నారు. ఇతర ప్రాంతాల వారు కూడా ఈ బంగారు బర్గర్ ను తినడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. నిజంగా ఈ బర్గర్ లను బంగారం తోనే తయారు చేశారా అని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రె స్టారెంట్ విడుదల చేసిన అడ్వర్టైజ్మెంట్ ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. ఇకపోతే సాధారణంగా ఈ రెస్టారెంట్లో విక్రయించే ఒక బర్గర్ ధర 800 రూపాయలు ఉంటుంది. ఎంతైనా ఈ రెస్టారెంట్ వారి యొక్క ఆలోచనకు ఫిదా కావాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *