అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్‌ బుధవారం ఉదయం కారు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రణ్‌తంబోర్ తిరిగి వస్తుండగా రాజస్థాన్‌లోని సూర్వల్ వద్ద లాల్సాట్-కోట హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాదంలో అజారుద్దీన్‌ కుటుంబ సభ్యులు చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం అజార్ ఫ్యామిలీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ భారత్‌ తరఫున 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 1992 నుంచి 1999 వరకూ భారత క్రికెట్ జట్టు తరఫున మూడుసార్లు ఐసీసీ వరల్డ్ కప్‌ పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *