విఓఏల సమ్మెకు జనసేన సంఘీభావం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలో విఓఏలు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ సెక్రటరీ గరికె రాంబాబు మరియు జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ విఓఏలు చేస్తున్న న్యాయపరమైన డిమాండ్లు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి, విఓఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పిఎఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఐడి కార్డులు ఇవ్వాలి, టి ఏ, లు డి.ఏ లు ఇవ్వాలి. యూనిఫామ్స్ ఇవ్వాలి, స్టేషన్ ఎలివేన్స్ ఇవ్వాలి. వీరు కోరుతున్న న్యాయ పరమైన డిమాండ్స్ ఇవ్వని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరపున రాస్తారోకోలు, ర్యాలీలు చేస్తామని విఓఏల వారి న్యాయపరమైన డిమాండ్లు అందే వరకు పోరాటం చేస్తామని వారికి అండగా ఉంటామని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ములకలపల్లి మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, కార్యదర్శి బాదావత్ రవికుమార్, సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు ఎస్.కె జాన్ పాషా, కమలాపురం గ్రామ కమిటీ నాయకులు మచ్చ శ్రీను, సుబ్బన్న పల్లి గ్రామ కమిటీ నాయకులు నక్కన రమేష్, ములకలపల్లి గ్రామ కమిటీ నాయకులు సుద్దాల రమేష్, గోపగాని సాయి ప్రకాష్, గోపగాని పవన్ కళ్యాణ్, కొత్తపల్లి శ్రీను, రింగిరెడ్డిపల్లి గ్రామ కమిటీ నాయకులు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.