అధినాయకుని అంతరంగానికి చేరువగా వీర మహిళ

ప్రజాసమస్య కోసం జనసేనపార్టీ ఆవిర్భావం రోజున జనం మధ్యలో నిరాహారదీక్ష
మహిళల దీక్షకు దిగొచ్చిన మునిసిపల్ అధికారులు
జనసేన పార్టీ నుండి వీరమహిళ పిల్లా రమ్య జ్యోతి!!

పిఠాపురం నియోజకవర్గం యందు పిఠాపురం టౌన్ నందు ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టమని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన, బిజెపి, తెలుగుదేశం, మహిళ సంఘాలు, స్వచ్చంధ సంస్థలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
‌ఈ సందర్భంగా సభ్యులు మరియు జనసేన వీరమహిళ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు నుండి ప్రజా అవసరాలు నిమిత్తం సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టమని ప్రజలు కోరుతున్నా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఎవ్వరూ పట్టించుకోవటం లేదు క్రిందటి నెలలో మహిళా మున్సిపల్ చైర్పైర్సన్ వారైనా మహిళల సమస్యను పట్టించుకుంటారనే ఆశాభవంతో మళ్ళీ ఆమెకు తెలియపర్చినా కౌన్సిల్ లో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అధికారులనుంచి ఎటువంటి స్పందన లేకపోవడం మహిళలుగా మమ్మల్ని ఆశ్చర్యం మరియు బాధకు గురిచేశాయి.మహిళల ఇక్కట్లు పట్టడంలేని ప్రజాప్రతినిధులు,అధికారులతో పోరాడి సమస్యను పరిష్కరించుకోవడం తెలుసు, నేడు ఆవిర్భావ దినోత్సవం చేత సంఖ్య ఒక్కరిగానే కనిపించొచ్చు తలచుకుంటే దీక్షను మరింత ఉద్రిక్తత చేయగలమని మా జనసేన వీరమహిళల నిబద్ధతను కూడా రుచి చూపిస్తామని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహారదీక్షలో అధికారులను, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేవరకు ఈ నిరాహారదీక్ష చేస్తామని అన్నారు.టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, జనసేన పార్టీ నుండి వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి, NFIW మహిళ సమైక్య కార్యదర్శి గంపా లోవరత్నం దీక్షలో కూర్చున్నారు.సాయంత్రానికి మునిసిపల్ కమీషనర్ గారు తమ అధికారునిని పంపి ఫోన్ ద్వారా వారం రోజులు టైం అడగగా సిస్టమ్ కు గౌరవం ఇవ్వాలి కాబట్టి వారికి కేవలం వారం రోజుల సమయాన్ని అందిస్తూ తాత్కాలికంగా దీక్షకు విరమణ అందచారు.ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత అధ్యక్షులు కొండేపూడి శంకరవు, RSS జిల్లా కార్యవాహ పెమ్మరాజు సత్య రామచంద్రరావు, బిజెపి నాయకులు, మహిళలు, ప్రయాణికులు మరియు యువత అధికంగా పాల్గొన్నారు.