సిపిఐ నారాయణ పై కేసు నమోదు చేసిన జనసేన నాయకులు

సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ని చిల్లర బేరగాడు, రాజకీయ బేరగాడు, రాజకీయ బ్రోకర్ అని ప్రెస్ మీట్ లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాధ్యతగల జాతీయ రాజకీయాల్లో ఉంటూ చిరంజీవి గారి పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి సి పి ఐ శ్రేణుల మధ్య, చిరంజీవి అభిమానుల మధ్య మరియు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు మధ్య గొడవలు జరిగి.. సంఘ విద్రోహం జరిగే ఈ విధంగా విభేదాలు సృష్టించడం అని.. కుట్రపూరితంగా మాట్లాడిన సిపిఐ నారాయణ పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసైనికులు, వీర మహిళలు మరియు మెగా అభిమానులు కే.పీ.హెచ్.బి పోలీస్ స్టేషన్లో సి.ఐ కిషన్ కుమార్ కి వినతిపత్రం ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రెటరీ మండలి దయాకర్, కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు కొల్లా శంకర్, దుర్గా శ్రీనివాస్, అంజి హరీష్, వెంకటేష్, వీర మహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి మరియు మెగాస్టార్ అభిమానులు పాల్గొన్నారు.