జనసేన సైనికుని కుటుంబానికి ఆర్థిక సాయం

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముజాఫ్ఫర్ నగర్ కి చెందిన షేక్ అబ్దుల్లా వారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు 40,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా చింతా సురేష్ బాబు మాట్లాడుతూ.. జూన్ 21.06.22న తన వృత్తి రీత్యా షేక్ అబ్దుల్లా జొహరాపురంలో కరెంటు పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మరణించడం జరిగింది. వారి తల్లి కి ఉన్న ఒకే ఒక్క కొడుకును కోలీపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి గుర్తించి జనసేన నాయకులు, జనసైనికులు అందరూ కలిసి ఆర్థిక సాయం చేయడం జరిగిందని.. ఆ మొత్తాన్ని బుదవారం కర్నూలు బిర్లా కాంపౌండ్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో షేక్ అబ్దుల్లా అమ్మగారికి అందించడం జరిగిందని.. రాబోయే రోజుల్లో షేక్ అబ్దుల్లా కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు మంజునాథ్, బజారి, సుధాకర్, పత్తికొండ నియోజకవర్గ నాయకులు గోవిందు, కోడుమూరు నియోజకవర్గం నాయకులు రాంబాబు, కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.