హార్డవేర్‌ షాపులో అగ్నిప్రమాదం

దీపావళి పండుగ పూట నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని రాందేవ్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్ షాపులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా షాపులో సామగ్రికి మంటలు అంటుకొని దావానంలా వ్యాపించాయి. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల థాటికి చుట్టుపక్కలున్న జనాలు రోడ్ల మీదికి పరుగులు తీశారు. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం జరిగి ఉంటుందని సమాచారం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక నష్టంపై స్పష్టత వచ్చే అవకాశముంది.