నిస్వార్థంగా పనిచేసే వారికి సముచిత స్థానం

*చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థలకు హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా శాంతి ప్రసాద్ నియామకం

ప్రజారాజ్యం పార్టీ నుండి జనసేన వరకు ప్రజా సేవలో నిరంతరం నిబద్ధతతో పని చేసిన సీనియర్ న్యాయవాది శింగలూరి శాంతి ప్రసాద్ కి విశిష్ట గౌరవం లభించింది. క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పని చేసే నాయకులకు జనసేన పార్టీలో గుర్తింపు లభిస్తుందనడానికి ఇది ఉత్తమ ఉదాహరణ. పార్టీ స్థాపన నాటి నుండి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అతి సమీపంగా ఉంటూ, రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తూ శాంతి ప్రసాద్ అమూల్యమైన సేవలు అందించారు. ఆయన నైపుణ్యం, నిబద్ధతను గుర్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫార్సుతో, ఆగస్టు 5, 2025న విడుదలైన జి.ఓ. ఆర్ టి. నెంబెర్. 266 ద్వారా చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థలకు హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా శాంతి ప్రసాద్ ని మూడు సంవత్సరాల కాలపరిమితితో ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా, ఆయనకు అభినందనలు తెలియజేస్తూ – నూతన బాధ్యతలలో మరింత కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని, న్యాయ రంగంలో నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

Share this content:

Post Comment