ఢిల్లీ చేరుకున్న తెలుగుదేశం నేతల బృందం

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలవబోతున్నారు. తెలుగుదేశం పార్టీపై దాడి, ఏపీలో డ్రగ్స్, గంజాయి అంశాలపై రాష్ట్రపతికి వివరించనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల అపాయింట్ మెంట్ ను టీడీపీ నేతలు కోరారు. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసే అవకాశముంది.