ప్రజలకు జవాబుదారీ కాగల రాజకీయ వ్యవస్థ పవన్ కళ్యాణ్ జనసేన వల్లే సాధ్యం

రాజకీయాల్లోకి ప్రవేశించడమంటే అవినీతికి పాల్పడటం అన్న అభిప్రాయం ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో చాలామందిలో ఉంది..వారసత్వ రాజకీయాలు అవినీతిని మరింత ప్రోత్సహిస్తున్నాయి..తండ్రి రాజకీయంగా ఒక కీలక పదవిలో ఉండగానే సంతానం అవినీతి కార్యకలాపాలకు పాల్పడటం, తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేయడం, తద్వారా వేల కోట్లు ఆర్జించడం, వచ్చిన డబ్బుని విదేశాలకు తరలించడం, దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ మార్గాల ద్వారా మళ్ళీ దేశానికి, రాష్ట్రానికి తరలించడం మన దేశం, మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.. ఈ దేశంలో కాంగ్రెస్ కొన్ని దశాబ్దాలుగా ఈ సంస్కృతిని పెంచి పోషించింది.. ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యే అవినీతిని తరతరాల అవినీతిగా చూడాలి..తరాల తరబడి పెరుగుతున్న ఈ అవినీతి ఒక సవాలుగా మారింది.. దేశంలో, ముఖ్యం
గా రాష్ట్రంలో బలీయమైన శక్తిగా మారింది.. ఒక తరం అవినీతిపరులకు సరైన శిక్ష పడనప్పుడు, రెండో తరం మరింత శక్తితో అవినీతికి పాల్పడుతుంది.. ఇది రాజకీయ సాంప్రదాయంలో భాగమై కూర్చుంది ఈవేళ

అవినీతి సామ్రాజ్యాల వల్ల దేశం డొల్లగా మారుతుంది.. ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నించినా మధ్య దళారులు అందులో తమ కమీషన్లను స్వాహా చేస్తారు.. పథకాల పేరిట లేని మనుషులను సృష్టించి, దొంగ సంతకాలు పెట్టి వేల కోట్లు స్వాహా చేస్తున్నారు.. వాటిని పార్టీ కార్యకర్తలను మేపడానికి ఉపయోగిస్తున్నారు

అక్రమంగా ఆర్జించిన వేల కోట్లు రాజకీయాల్లో ప్రవేశించి.. ఎన్నికల ప్రక్రియను కలుషితం చేసి ఒక్కో అభ్యర్థి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడి, అలా ఖర్చు చేసిన అభ్యర్థి మళ్ళీ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడు.. ఇదొక విషంలా మారి మొత్తం రాజకీయ వ్యవస్తే కుళ్ళిపోతోంది

ఒక స్వచ్ఛమైన, పారదర్శకమైన, ప్రజలకు జవాబుదారీ కాగల రాజకీయ వ్యవస్థ అవసరం.. అది పవన్ కళ్యాణ్ జనసేన వల్లే సాధ్యం

గోపాలకృష్ణ
రాజేంద్రనగర్ నియోజకవర్గం