శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేయాలి..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ స్వామి వారితో ఆటలాడుకుంటున్నారని శ్రీవారి ట్రస్ట్ పేరుతో వసూలు చేసిన సొమ్ముపై అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిటిడి అధికారులపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని తిరుపతి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 వేల 500 రూపాయలు వసూలు చేస్తున్న శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కు ఓకే రసీదు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో పోగు చేసిన నిధులతో 10 లక్షలు వెచ్చించి 12 వేల ఆలయాలను నిర్మిస్తున్నామని అధికారులు చెప్పారన్నారు. అయితే 12 వేల ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఏ దశలో నిర్మాణాలు జరుగుతున్నాయో బహిరంగపరచాలన్నారు.. తిరుమలలో ఏదో జరుగుతోందని, అందుకే వరుస రోడ్డు ప్రమాదాలు, గోవిందరాజస్వామి ఆలయంలో చెట్టు విరిగిపోవడం, ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.. సాంప్రదాయాలను తుంగలో తొక్కి టిటిడిలోని ఓ కీలక అధికారి విధుల్లో చేరడం వల్ల ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.. శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, నాయకులు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మునుస్వామి, రాజేష్ ఆచారి, హేమవంత్, మోహన్, కిరణ్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.