విస్తృత స్థాయి అత్యవసర సమావేశం

డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి అత్యవసర సమావేశం సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో జరిగింది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన-టిడిపి పొత్తులో భాగంగా అసెంబ్లీ స్థానాన్ని టిడిపికి కేటాయించడంపై విస్తృతంగా చర్చించారు. 2019లో తొలి అభ్యర్థిగా పితాని బాలకృష్ణను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ దఫా కూడా ఆయనకే తొలి సీటు ప్రకటిస్తారని తామంతా భావించామని కానీ టిడిపికి కేటాయించడం జరిగిందని నేతలు వాపోయారు. పొత్తు ధర్మం ప్రకారం ఇరు వర్గాలకు ముందస్తు సమాచారం ఇస్తారని భావించామని కానీ పార్టీ ఆ విధంగా జరగకపోవడం తమను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ అభ్యున్నతికి ఎంతగానో పాటుపడిన నియోజకవర్గం ఇన్చార్జి పితాని బాలకృష్ణను సీటు కేటాయింపునకు పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీని తన భుజ స్కందాలపై 6 ఏళ్లకు పైగా మోసిన బాలకృష్ణకు జిల్లాలో ఏదో ఒక అనువైన నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలి అని వారు పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ పిఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ మాట్లాడుతూ తనకు తొలి నుండి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తనకు అసెంబ్లీ సీటు కేటాయింపు అంశంలో తొలి నుండీ భరోసా ఇచ్చారని పార్టీ ఏనాడూ తనకు ఈ అంశంపై భిన్నమైన సమాచారం ఇవ్వలేదని అన్నారు. అయితే పొత్తులో భాగంగా సీటును టిడిపికి కేటాయించిన తరువాత తాను విజయవాడ పార్టీ కార్యాయానికి వెళ్లి అధ్యక్షుని కలిసే ప్రయత్నం చేయగా ఆయన పి ఏ సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు భాద్యతలు అప్పగించారని ఆయన ఆదివారం ప్రత్యేకంగా మనోహర్ ముమ్మిడివరం నియోజకవర్గర పార్టీ ముఖ్య నాయకులతో సమావేశలో పార్టీ పితానికి తప్పని సరిగా అవకాశం కల్పిస్తుందని భరోసా ఇచ్చారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పితాని పట్ల ప్రత్యేక అభిమానంతో ఉన్నారని ప్రత్యమ్యాయ నియోజవర్గంలో పోటీపై 1వ తేదీ తరువాత కబురు చేసి తుది నిర్ణయం తీసుకుందామని తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జిల్లా కార్యవర్గసభ్యులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు, పితాని అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.