గాజువాకలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

గాజువాక నియోజకవర్గం, పాత గాజువాక 60 ఫీట్ రోడ్డు వద్ద జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం క్రియాశీల సభ్యత్వం వాలంటీర్ ములకలపల్లి వంశీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన కార్యకర్తలకు సభ్యత్వం చేయటం జరిగింది. మరియు రెండు రోజులు గడువు పెంచడం వలన ఇంకా ఎవరైనా సభ్యత్వం చేసుకోనివారు ఉంటే తప్పనిసరిగా చేసుకోవాలని తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పత్తి రామలక్ష్మి, కసిరెడ్డి సుజాత, సుకుమార్ రెడ్డి, సాయి కుమార్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.