గొర్ల మన్మధరావు షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గొర్ల మన్మధరావు మొబైల్ షాప్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, కుటుంబ సభ్యులు ఇతర బంధువులు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ మన్మధరావు గత 2014 నుంచి జనసేన పార్టీలో చురుగ్గా పాల్గొంటూ ఈరోజు తన వృత్తిని విడిచిపెట్టి పార్టీ అభివృద్ధి కొరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదుగుదలకోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉండటం కోసం తన స్వగ్రామం అయినటువంటి పాలకొండ పట్టణంలో మొబైల్ షాప్ పెట్టడం జరిగింది. 2024లో పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం కోసం తనవంతుగా తన మొబైల్ షాప్ నే పార్టీ ఆఫీసులా తను నమ్మే దైవం పవన్ కళ్యాణ్ అని తన షాపులో పవన్ కళ్యాణ్ చిత్రపటం వేయించడం జరిగింది. జనసేన ప్రభుత్వం స్థాపించాలి అనే ప్రయత్నంతో ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాలతో అంగరంగ వైభవంగా షాప్ ప్రారంభం జరిగింది.