క్రియాశీలక సభ్యత్వం మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలి

నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట్ మండలం, రాళ్ళ చేరువు తాండలో జనసైనికుల క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి కార్యక్రమం జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రదాన కార్యదర్శి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు కిరిటి గౌడ్, సూర్య, సంతోష్, లింగం నాయక్, గ్రామ జనసైనికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.