అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేశాక నియోజకవర్గానికి రావాలి

  • జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్

విజయవాడ వెస్ట్: పశ్చిమ నియోజకవర్గానికి పైసా నిధులు ఇవ్వని సీఎం జగన్ గో బ్యాక్ గో బ్యాక్ నిరసన కార్యక్రమాన్ని కోమల విలాస్ సెంటర్ వద్ద ముస్లిం సోదర సోదరీమణులతో కలసి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు పోతిన మహేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. వాహనమిత్ర పథకం నిధుల విడుదలకు పశ్చిమ నియోజకవర్గానికి వస్తున్న సీఎం జగన్‌.. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆటో డ్రైవర్ల వెతల గురించి ఓసారి ఆలోచించాలి. ఆటోలకు వేసిన ఈ చలాన్‌లను రద్దు చేసి, చిత్తశుద్ధిని నిరుపించుకోవాలి. ఆటో డ్రైవర్లకు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. వాళ్లకి గృహసముదాయలు నిర్మించాలి. జగన్ ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయలు ఆటో డ్రైవర్లుకు కాదు, ఆటో యజమానులకు. రాష్ట్రంలో ఉద్యోగాలు రాక వందలామంది నిరుద్యోగులు ఆటో డ్రైవర్లుగా మారారు. ఈ దుస్థితికి కారణం సీఎం జగనే. ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలి. వెల్లంపల్లి అవినీతిపై సీఎం జగన్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.